ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీస్టేషన్లో నమోదైన కేసు విషయంలో భార్గవ్‌ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్‌కుమార్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో భూమా భార్గవ్ తనపై దురుసుగా ప్రవర్తించారంటూ... గచ్చిబౌలి పీఎస్‌లో ఎస్సై రమేశ్ ఫిర్యాదు చేశారు. కారు ఆపినట్టే ఆపి తమపైకి పోనిచ్చే ప్రయత్నం చేసి విధులకు ఆటంకం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 353,336 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసునమోదు చేశారు.
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై కేసు - CASE FILED ON AP EX MINISTER AKHILA PRIYA'S HUSBAND BHARGAV
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై కేసునమోదైంది. ఓ ఎస్సై ఫిర్యాదు మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లు కేసు నమోదు చేశారు.
CASE FILED ON AP EX MINISTER AKHILA PRIYA'S HUSBAND BHARGAV
Last Updated : Oct 8, 2019, 9:42 PM IST