చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు శిఖా చౌదరిపై కేసు నమోదు చేశారు. జయరాం ఇంటినుంచి పలు కీలక పత్రాలు తీసుకెళ్లిందని జయరాం మామ పిచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు ఆధారాలు పోలీసులకు సమర్పించారు. ఐపీసీ 448, 380, 506 సెక్షన్ల కింద శిఖాపై కేసు నమోదు చేశారు.ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, సహ నిందితుడు శ్రీనివాస్ రిమాండ్లో ఉన్నారు. మరో నలుగురి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రౌడీషీటర్లు నగేశ్, విశాల్ తోపాటు రాకేశ్ రెడ్డి స్నేహితులు సుభాష్ రెడ్డి, అంజిరెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. వీళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను ప్రశ్నించారు. వీరి ప్రమేయంపై ఇంకా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.
శిఖాపై కేసు నమోదు
శిఖా చౌదరిపై జయరాం మామ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జయరాం హత్యానంతరం ఇంట్లో నుంచి దస్త్రాలు, వస్తువులు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
శిఖాపై కేసు నమోదు
Last Updated : Feb 26, 2019, 5:10 PM IST