Case Against Corrupted Cops Telangana 2024 :రాష్ట్రంలో విధి నిర్వహణలో తప్పులు చేసే పోలీసుల ఆటలు కట్టించాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై క్రమశిక్షణ చర్యలతో పాటు, చట్టపరంగా కూడా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ సస్పెన్షన్‌తో మాత్రమే సరిపెడుతుండగా ఇకపై ఉద్దేశపూర్వకంగానే తప్పు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యే పక్షంలో,క్రిమినల్ కేసులు (Case Files On Police) కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులతోపాటు గతంలో నమోదైన వాటినీ సమీక్షించనున్నట్లు సమాచారం.
Police Case on Ex MLA Shakeel Son :పోలీసుల పనితీరుపై విమర్శలకు లెక్కలేదు. పైరవీలకు లొంగిపోయో, ఒత్తిడి తట్టుకోలేకో, లంచాలకు ఆశపడో కేసులను తారుమారు చేస్తారనే అపవాదులు తరచూ వస్తుంటాయి. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్(Ex MLA Shakeel Son) తన మిత్రులతో కలిసి కారుతో ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో నిందితులను తారుమారు చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట సీఐ దుర్గారావును అధికారులు సస్పెండ్‌చేశారు. ప్రలోభాలకు ఆశపడే దుర్గారావు, సాహిల్ డ్రైవర్‌ను నిందితునిగా చేర్చారన్నది ప్రధాన అభియోగం.
భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ
Cops Suspended in Telangana 2023 :పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ బాధితురాలితో అనుచితంగా ప్రవర్తించారన్నది మరో ఎస్‌ఐపై ఉన్న అభియోగం. పోలీసులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నించడం, పరిధి దాటి వ్యవహరించడం, ప్రాథమిక ఆధారాలు లేకపోయినా కేసులు నమోదు చేయడం వంటివన్నీ చట్ట ఉల్లంఘనల కిందకు వస్తాయి. సాధారణంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు విచారిస్తారు. ప్రాథమిక ఆధారాలు ఉంటే ఉన్నతాధికారులు సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటారు.
రాజకీయ ఒత్తిడి ఉంటే మాత్రం విచారణతోనే సరిపెట్టేవారు. సస్పెండ్ అయినవారు ఏదోవిధంగా దాన్ని ఎత్తేయించుకుని పోస్టింగ్ తెచ్చుకునేవారు. దీంతో తప్పుచేసినా మాకేం కాదులే అనే భరోసా ఏర్పడింది. అందుకే ఎన్ని ఆరోపణలు వస్తున్నా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదు. ఈ పరిస్థితులను కఠినమైన చర్యల ద్వారానే చక్కదిద్దాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. సస్పెండ్ అయిన వారిపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పైరవీలు చేసి సస్పెన్షన్ ఎత్తివేయించుకునే అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. ఇకపై గీత దాటే పోలీసులపై కేసులు కూడా నమోదు చేయాలనే ఆలోచనతో ఉంది.