Case Against MP keshava Rao Sons : హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో.. ఎంపీ కేశవరావు ఇద్దరు కుమారులపై కేసు నమోదైంది. జూన్ 13వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్బీటీనగర్ సర్వే నంబర్ 129 (కొత్త సర్వేనంబర్ 403)లో షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి.. 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్‌కు చెందిన పి.సుదర్శన్‌రెడ్డి (మృతి చెందారు) 470 గజాలు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లో నివసించే జయమాల 469 గజాల స్థలాన్ని 1983లో సంయుక్తంగా కొనుగోలు చేశారు.
Case Against BRS MP KK Sons :ఇందులో భాగంగానే సుదర్శన్‌రెడ్డి దక్షిణం.. జయమాల ఉత్తరం వైపు భాగాలు తీసుకున్నారు. తర్వాత జయమాల అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లోని జయమాల నివసించిన ఇంటికి గత సంవత్సరం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,13,67,500లకు స్థలాన్ని విక్రయించారని తెలిపింది. ఆ పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీ.. రూ.1,40,41,300 చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
Case Registered Against MP KK Sons : దీంతో కంగుతిన్న జయమాల కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. నోటీసు వెనుక కారణం గురించి ఆందోళనకు గురయ్యారు. మరోవైపు 2019లో ఎంపీ కె.కేశవరావు కుమారుడు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్.. విప్లవ్‌కుమార్‌కు స్థలంపై అధికార హక్కులతో కూడిన స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తాను ఇచ్చినట్లు ఉన్న పత్రాలు జయమాల గమనించారు. జులై 19, 2013లో ఆ స్థలాన్ని విప్లవ్‌కుమార్ తన సోదరుడు కె.వెంకటేశ్వర్‌రావు అలియాస్ వెంకట్‌కు రూ.3 లక్షలకు విక్రయించిన రిజిస్టర్ దస్తావేజులను ఆమె గుర్తించారు.