ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్, తెలంగాణ మలయాళీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 64వ కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా దేశంలోని 55 ప్రాంతాల్లో ఏకకాలంలో కార్టూన్, వింటేజ్ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ కార్టూనిస్ట్ ఉన్నిక్రిష్ణన్, తెలంగాణ రాష్ట్ర మలయాళీ అసోసియేషన్ ఛైర్మన్ సురేందర్ పాల్గొన్నారు. కార్టూన్, వింటేజ్ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. పలువురు కార్టూనిస్ట్‌లను ఘనంగా సత్కరించారు. కేరళ సంప్రదాయాలు ఉట్టేపడే ఫోటోలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై ప్రముఖ కార్టూనిస్ట్ సుధీర్‌నాథ్ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. 55 కార్టూన్ చిత్రాలు, 61 వింటేజ్ ఫోటోలు వీక్షకులను మంత్రమగ్ధులను చేశాయి. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పదర్శనను తిలకించి మురిసిపోయారు. మూడురోజులపాటు ఈ వేడుకలు సాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఆలోచింపజేసిన కేరళ కార్టూన్లు... ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ - KERALA FORMATION DAY CELEBRATIONS IN HYDERABAD
హైదరాబాద్‌లో కేరళ అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కార్టూనిస్టులు వేసిన చిత్రాలు, కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా తీసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి.
CARTOONS VINTAGE PHOTO EXPO ON KERALA FORMATION DAY IN HYDERABAD