కరోనా కలకలం: గాంధీ ఆసుపత్రిలో 10 అనుమానిత కేసులు - carona symptomatic cases joined in gandhi hospital
10:42 February 06
గాంధీ ఆస్పత్రిలో కరోనా వ్యాధికి సంబంధించి ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి 10 మంది అనుమానిత లక్షణాలతో ఇప్పటికే ఆస్పత్రిలో చేరారు. రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల గాంధీలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలతో వచ్చే రోగులను ప్రత్యేక లిఫ్ట్‌లో ఐసోలేటెడ్ వార్డుల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు గాంధీలోనే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గాంధీలో చేరిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు వరంగల్ వాసులు ఉండటం గమనార్హం. ఇందులో ఒకరు చైనా నుంచి వచ్చినట్లు సమాచారం. ఇక ఫీవర్ ఆస్పత్రిలోనూ 5 అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.