ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం యూకే స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు యూకే స్ట్రెయిన్ ఉన్నట్లు తేలిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల్లో ఈ విషయం వెల్లడైందని ఆయన తెలిపారు. యూకే నుంచి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్‌కు చెందిన ఈ కొత్త స్ట్రెయిన్ విస్తరించినట్లు ఎలాంటి దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో ప్రవేశించిన స్ట్రెయిన్... మహిళకు నిర్ధరణ - ఏపీలో యూకే స్ట్రెయిన్ కేసుల తాజా వివరాలు
సంవత్సర ప్రారంభంలో కరోనా భయపెట్టగా... ఏడాది ముగింపులో కొత్త రకం యూకే స్ట్రెయిన్ కలవరపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్ ప్రవేశించగా... తాజాగా ఏపీలోనూ ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

ఏపీలో ప్రవేశించిన స్ట్రెయిన్... మహిళకు నిర్ధరణ
యూకే నుంచి రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చిన మహిళ కుమారుడికి నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యిందని వెల్లడించారు. ఆమె నుంచి మరెవరికీ కరోనా సోకలేదని తెలిపారు. ఆమె సంబంధీకులకు కూడా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామన్నారు. వారందరికీ నెగెటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదీచదవండి: "కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల