తెలంగాణ

telangana

ETV Bharat / state

'829 మంది ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్థులకు కరోనా' - ఏపీ స్కూళ్లలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 99 శాతం మేర పాఠశాలలు తెరుచుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. నవంబర్ 2 నుంచి 5 వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ రాష్ట్రవ్యాప్తంగా 829 ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లుగా వెల్లడించింది.

'829 మంది ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్థులకు కరోనా'
'829 మంది ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్థులకు కరోనా'

By

Published : Nov 6, 2020, 5:07 AM IST

ఏపీ వ్యాప్తంగా 99 శాతం మేర పాఠశాలలు తెరుచుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 9, 10 తరగతులకు చెందిన 4.18 లక్షల మంది విద్యార్థుల్లో 35 శాతం మాత్రమే హాజరయ్యారని తెలిపారు. 86,656 మంది ఉపాధ్యాయుల్లో 89 శాతం హాజరైనట్లు ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 2 నుంచి 5 వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏపీ వ్యాప్తంగా 829 ఉపాధ్యాయులకు, 575 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లుగా వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details