హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 202 జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మార్క్స్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మార్క్స్ ఆశయ సాధనకు కృషి: చాడా - Chada Venkatreddy
కార్ల్ మార్క్స్ ఆశయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. మార్క్స్ జయంతి సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మార్క్స్ అనేక దేశాలు పర్యటించారని.. ఒక మనిషిని మరో మనిషి ఎలా దోపిడీ చేస్తున్నాడో తెలుసుకొని అధ్యయనం చేశారని చాడా పేర్కొన్నారు. దోపిడీకి గురవుతున్న వర్గం వారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వల్ల మానవాళిలో పేదరికం, దారిద్య్రం విలయతాండవం చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చేతి వృత్తులు, వలస కార్మికులు విలవిల్లాడుతున్నారని.. దేశంలో 40 కోట్ల మంది అసఘంటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ రూ. 7 వేలు చెల్లించాలని కోరారు. మార్క్స్ ఆశయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తుందని చాడా స్పష్టం చేశారు.