హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. బషీర్ బాగ్ ఓల్డ్ కమేలా ప్రాంతంలో మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో 200మంది పోలీసులతో ఈ సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలతోపాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల్లో ధైర్యం కల్పించడం కోసమే తాము నిర్భంధ తనిఖీలు చేపట్టినట్లు... ప్రజలు కూడా దీనికి సహకారం అందించినట్లు మధ్యమండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"
హైదరాబాద్ నారాయణగూడలో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 19 ద్విచక్ర వాహనాలతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"
Last Updated : Aug 18, 2019, 6:36 AM IST