అంబర్‌పేటలోని పలు ప్రాంతాల్లోని రహదారలపై వాహనాలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ధ్రువపత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అంబర్‌పేటలో పోలీసుల నిర్భంధ తనిఖీలు - ఆకస్మిక తనిఖీలు
అంబర్‌పేటలోని అలీకేఫ్ చౌరస్తాలో ఏసీపీ సుదర్శన్, అంబర్‌పేట సీఐ రమేష్ ఆధ్వర్యంలో 40 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా పోలీసుల నిర్భంధ తనిఖీలు