హైదరాబాద్ ఉప్పల్‌లో ఆదివారం అర్థరాత్రి కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో శ్రీనివాస సినిమా హాల్ వద్ద అతివేగంగా కారు దూసుకొచ్చింది. మితిమీరిన వేగం వల్ల ఫ్యాన్సీ నంబర్ ఉన్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొడుతూ బోల్తాపడింది.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు... రోడ్డుపై ఫల్టీలు - road accident in uppal hyderabad
హైదరాబాద్ ఉప్పల్‌లో ఆదివారం అర్థరాత్రి మద్యం మత్తులో ఓ డ్రైవర్ మితిమీరిన వేగంతో రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టాడు. కారు పల్టీలు కొడుతూ బోల్తాపడగా.. డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమీప ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మితిమీరిన వేగంతో డివైడర్‌కు ఢీ.. పల్టీలు కొడుతూ కారుబోల్తా
డ్రైవర్ రామాంతపూర్‌కు చెందిన సింగారం రాముగా గుర్తించినట్లు సీఐ రంగస్వామి తెలిపారు. కారులో డ్రైవర్ మాత్రమే ఉండగా.. అతనికి గాయాలవగా.. సమీపంలోని ఆదిత్య ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రహదారిపై రాకపోకలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీఐ వివరించారు.