హైదరాబాద్ భరత్‌నగర్‌లో అదుపు తప్పి కారు ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బోరబండ ప్రాంతానికి చెందిన సోహైల్‌గా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లో మళ్లీ ఫ్లై ఓవర్ పైనుంచి దూకిన కారు.. ఒకరు మృతి - బ్రిడ్జి పైనుంచి నుంచి కారు పల్టీలు
అర్ధరాత్రి టీ కోసమని వెళ్లారు. కమ్మని చాయ్ తాగి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయలయ్యాయి.
car accident
బొరబండకు చెందిన ఆరుగురు వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో టీ తాగడానికి బాలానగర్ చౌరస్తాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భరత్ నగర్ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపుతప్పి కింద పడింది.