రాష్ట్రంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కో వాహనానికి లక్షలు వెచ్చించి కోరిన నంబర్ కైవసం చేసుకుంటున్నారు. ఇలా వాహన యజమానుల్లో పెరుగుతున్న నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ.18.15లక్షల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా టీఎస్ 09 ఎఫ్జీ 9999 నంబర్‌కు రూ.5,50,000లు వచ్చాయి. టీఎస్ 09 ఎఫ్హెచ్ 0099 నంబర్‌కు రూ.3,36,000లు, టీఎస్ 09 ఎఫ్హెచ్ 0005 నంబర్‌తో రూ.1,10,000ల ఆదాయం వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు.. - లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్లు..
రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల వేలంతో లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. నిన్న ఒక్కరోజే రవాణాశాఖకు రూ.18.15లక్షల ఆదాయం వచ్చింది.

లక్షలు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్లు..