సికింద్రాబాద్ బోయినిపల్లిలో గ్రాండ్ ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి కారు నడుపుతూ హోటల్ పైకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బోయినిపల్లిలోని స్వీట్హార్ట్ హోటల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా హోటల్లోకి దూసుకెళ్లడం వల్ల అక్కడ ఉన్న స్థానికుడు వినయ్ గాయాలపాలయ్యాడు. వినయ్ని ఢీకొట్టి హోటల్ వద్ద పార్క్ చేసి ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలపైకి కారు దూసుకెళ్లింది. చోదకుడిని బోయిన్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ పరిస్థితి విషమించడం వల్ల కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బోయిన్పల్లిలో కారు బీభత్సం - secndrabad
హైదరాబాద్లోని బోయినిపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి వల్ల ఒకరు గాయాలపాలయ్యారు. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
బోయిన్పల్లిలో కారు బీభత్సం