బంజారాహిల్స్‌లో కారు బీభత్సం హైదరాబాద్‌లో తరచూ కారు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా మరో కారును ఢీకొట్టి.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడే రోడ్లు శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
పలువురికి గాయాలు
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కారులోని ముగ్గురు యువకులు అత్తాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!