తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధానిని మార్చిన సీఎంలు చరిత్రలో లేరు: చంద్రబాబు - ap assembly news

స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజధానిని మార్చిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమేనని ప్రతిపక్షనేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎక్కడైనా అభివృద్ధి వికేంద్రీకరించారు తప్ప.. పరిపాలనను కాదని వ్యాఖ్యానించారు.

BABU COMMENTS ON JAGAN
రాజధానిని మార్చిన సీఎంలు చరిత్రలో లేరు: చంద్రబాబు

By

Published : Jan 20, 2020, 11:25 PM IST

రాజధానిని మార్చిన సీఎంలు చరిత్రలో లేరు: చంద్రబాబు

చరిత్రలో ఎక్కడైనా అభివృద్ధిని వికేంద్రీకరించారు తప్ప.. పరిపాలనను కాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజధానిని మార్చిన ముఖ్యమంత్రి... జగన్మోహనరెడ్డి ఒక్కడేనని ఎద్దేవా చేశారు. రాజధాని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే ప్రాంతంలో పెట్టాలన్నారు. అమరావతి అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందన్నారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు దేశ రాజధానిగా దిల్లీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాలతో పాటు... ఆంధ్రరాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాజధానిగా ఉందని.. అప్పట్లో అది కూడా అన్ని ప్రాంతాలకు దగ్గరలోనే ఉండేదన్నారు. రాజధాని ఏర్పాటుతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందవన్నారు. ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడే ప్రాంతాలు అభివృద్ధి అవుతాయని పేర్కొన్నారు.

శుక్రవారం కోర్టుకు వెళ్లే వాళ్లు మా గురించి మాట్లాడుతున్నారు

రాజధాని అంశంపై చర్చ సమయంలో చంద్రబాబు మాట్లాడుతుండగా ఓటుకు నోటు అంటూ.. అధికార పక్ష సభ్యులు అరవడంతో.. శుక్రవారం కోర్టుకు వెళ్లేవారంతా తమను విమర్శిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు

ABOUT THE AUTHOR

...view details