తెలంగాణ

telangana

ETV Bharat / state

'2021 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి' - కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్

రాబోయే ఏడాది.. మహమ్మారిని తరిమేసి, అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్ జంపన ప్రతాప్ ఆశాభావం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్ మైదానంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Cantonment Sports Association chairman, hopes that 2021 will be brighten everyone's lives.
'2021 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

By

Published : Jan 1, 2021, 5:09 PM IST

2020వ సంవత్సరం ప్రపంచానికి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్, భాజపా నేత జంపన ప్రతాప్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బోయిన్​పల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్థానికులకు శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా మూలంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు ప్రతాప్. ప్రపంచం చిన్నాభిన్నమైన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. 2021వ సంవత్సరం.. మహమ్మారిని తరిమేసి, అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:కరోనా భయాల మధ్యే 2021కి ప్రపంచం స్వాగతం

ABOUT THE AUTHOR

...view details