తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటోన్మెంట్ బోర్డ్ తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి' - కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్

సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ వద్ద స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డ్ తొలగించిన ఓట్లు పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. ఈ నిరసనలో మల్కాజిగిరి తెరాస ఇంఛార్జ్​ మర్రి రాజశేఖర్​రెడ్డి పాల్గొని బాధితుల తరఫున నిరసన వ్యక్తం చేశారు.

cantonment locals protest for Deleted votes should be restored immediately
cantonment locals protest for Deleted votes should be restored immediately

By

Published : Mar 16, 2022, 4:45 PM IST

సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్ బోర్డ్ తొలగించిన ఓట్లు పునరుద్ధరించాలని, భూ బదలాయింపు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మల్కాజిగిరి తెరాస ఇంఛార్జ్​ మర్రి రాజశేఖర్​రెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ మడ్ ఫోర్డ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. కంటోన్మెంట్​లో నివసిస్తున్న 28 వేల పేద ప్రజల ఓట్లను తొలగించడం సరికాదని మర్రి రాజశేఖర్​రెడ్డి మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల హక్కులను కాలరాస్తూ.. అకారణంగా ఓటు హక్కును తొలగించటం దారుణమన్నారు.

"58, 59 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పేద ప్రజలకు భూ బదలాయింపు చేసే వీలును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కేంద్ర రక్షణ శాఖ భూముల్లో ఉన్న పేద ప్రజలకు కేంద్రం వెసులుబాటు కల్పించి.. భూ బదలాయింపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రెండు పడక గదుల ఇల్లు నిర్మించుకునే అవకాశం కలుగుతుంది. దాని ఫలితంగా ఓట్ల పునరుద్ధరణ జరుగుతుంది. రక్షణశాఖ భూముల్లో గత కొన్నేళ్లుగా నివాసముంటున్న పేద ప్రజలకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది." -మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జ్

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details