హైదరాబాద్‌లో గంజాయి (Cannabis in Hyderabad) విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ ఉన్నతాధికారులు 'గంజా ముక్తి హైదరాబాద్' (Ganja Mukthi Hyderabad) పేరుతో కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ బయట నుంచి గంజాయి ఎలా వస్తుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఓ గంజాయి స్మగ్లర్‌ను ప్రత్యేక బృందం పోలీసులు అదుపులోకి తీసుకుంది.
అతడిని విచారించగా... తాము ఫలానా అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని, అందుకే గంజాయి తీసుకువచ్చినప్పుడు వారు మాకు సహకరిస్తారంటూ వివరించారు. స్మగ్లర్ తెలిపిన వివరాలపై ఆరా తీసిన పోలీసులు మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పోలీస్ ఠాణాల్లో కొందరికి మామూళ్లు (Cannabis in Hyderabad) ముడుతున్నాయని ఆధారాలు సేకరించారు. ఇందులో ఇన్స్పెక్టర్ రణ్వీర్ రెడ్డి, ఇద్దరు ఎస్సైలు రామునాయుడు, వెంకట్ కిషన్‌లు దొరికిపోయారు.
గుట్టుచప్పుడు కాకుండా...
రాజధాని నగరానికి గంజాయి ఎక్కువగా విశాఖ ఏజెన్సీ, గుల్బర్గా, బీదర్ నుంచి వస్తోంది. హైదరాబాద్(Cannabis in Hyderabad)తో పాటు, మహారాష్ట్రలోని నాందేడ్, ముంబయిలకు గంజాయిని సరఫరా చేసేందుకు స్మగ్లర్లు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. కూరగాయలు, ఇనుప వస్తువులు ప్లాస్టిక్ డబ్బాల మాటున గంజాయి రవాణా అవుతోంది. కచ్చితమైన సమాచారం వచ్చినప్పుటు మాత్రం డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు, పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతిసారీ వందల కిలోలకు పైగా గంజాయి పట్టుబడుతోంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి కిలో రూ.3వేలకు కొని, ఇక్కడ రూ. 7 వేల నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు.
గంజాయి నిర్మూలనే లక్ష్యం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని సీపీ అంజనీకుమార్ (Hyderabad Cp Anjani Kumar) తెలిపారు. 25 రోజుల్లోనే 148 మంది గంజాయి వ్యాపారులను అరెస్టు చేసి జైలుకు తరలించామన్నారు. ఇందులో 23మందిపై పీడీ చట్టం ప్రయోగించామని ఆయన వివరించారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ఎలాంటి సమాచారమున్నా 9490616555 నంబర్‌కు వాట్సాప్ చేయాలని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు.
ఇదీ చదవండి:Drugs Addiction: మత్తుకు యువత చిత్తు.. ఆందోళనకరంగా పరిస్థితులు