అజయ్ కుమార్ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ
వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ కుమార్ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ - Ajay Kumar Managing Director of Vaishnavi Hospital died
వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అజయ్ కుమార్ ఆత్మహత్యకు ముందు తన మరణానికి కారకులైన వారి పేర్లు సూసైడ్ నోట్లో రాసినా..పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అత్మకు శాంతి కలగాలని ఆయన నివాసం నుంచి బీఎన్ రెడ్డి చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఇందులో అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అతని బలవన్మరణానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం తమ ఆస్పత్రి భవనం యజమాని కరుణారెడ్డి, అతని బావమరిది కొండల్ రెడ్డి, సరస్వతీనగర్ కాలనీ అధ్యక్షుడు మెగారెడ్డితోపాటు యాంజల్కి చెందిన శివకుమార్ తనను మానసికంగా వేధించారని లేఖ రాసి... డాక్టర్ అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ లేఖ, అజయ్ కుమార్ డైరీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అజయ్ కుమార్ అత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ