తెలంగాణ

telangana

ETV Bharat / state

'హాథ్రస్​' ఘటనకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ - youth congress candle rally in nacharam

హైదరాబాద్​ నాచారంలో యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్​ చేశారు. ​

candle-rally-under-the-auspices-of-youth-congress-in-nacharam
'హాథ్రస్​' ఘటనకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Oct 2, 2020, 6:08 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దళిత యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలను ఖండిస్తూ హైదరాబాద్​ నాచారంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత యువతి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని నరేందర్​ యాదవ్​ డిమాండ్​ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీనివాస్ యాదవ్, ఆశు శ్రీకాంత్ గౌడ్, శంకర్ గౌడ్, వరుణ్, సాయిరాజ్, భవాని, శ్రీరామ్, ఫణి, శ్రీను, అశోక్, సంపత్, సునీల్ గౌడ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి: జేపీ

ABOUT THE AUTHOR

...view details