తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్​ ఉద్యోగాల్లో అభ్యర్థులకు వయోపరిమితి ఆందోళన

AP Police Notification Age Limits: అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 6 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలా మంది కోచింగ్ సెంటర్లలో చేరేందుకు వరుస కడుతున్నారు. అదే సమయంలో ఏళ్ల తరబడి పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న మరికొందరికి.. ఈ నోటిఫికేషన్ వేదన కలిగిస్తోంది. కొద్ది రోజుల తేడాతోనే వీరంతా అనర్హులుగా మారిపోతున్నారు. వయోపరిమితి సడలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

AP POLICE
AP POLICE

By

Published : Dec 1, 2022, 12:42 PM IST

AP Police Notification Age Limits: తెలుగుదేశం హయాంలో 2018లో 334 ఎస్సై, 2,723 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్సై ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 24 ఏళ్లు అర్హతగా నోటిఫికేషన్​లో తెలిపారు. కానీ వయోపరిమితి సడలింపు లేక.. కొందరు రోజులు, నెలల తేడాతో అనర్హులుగా మారారు. మొన్నటి వరకు తమతో కోచింగ్ తీసుకున్న వారు ఇప్పుడు అనర్హులుగా మారారని అభ్యర్ధులు చెబుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితి సడలించాలని కోరుతున్నారు.

పోలీస్​ ఉద్యోగాల్లో అభ్యర్థులకు వయోపరిమితి ఆందోళన

తెలంగాణ ప్రభుత్వంతో పాటు అగ్నివీరుల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల వయోపరిమితిని సడలించిందని అభ్యర్ధులు చెబుతున్నారు. ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే కేంద్రాలు విజయవాడ నగరంలో కొన్ని ఉన్నాయి. నాలుగేళ్లుగా నోటిఫికేషన్ రాకపోయినా.. వస్తుందనే నమ్మకంతోనే కోచింగ్ కేంద్రాలను నడుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇన్నాళ్లూ నోటిఫికేషన్ రాకపోవటంతో మధ్యలోనే చాలామంది వెళ్లిపోయారని అంటున్నారు. కోచింగ్ తీసుకుంటున్న కొందరు వయోపరిమితి కారణంగా అనర్హులుగా మారటం బాధ కలిగిస్తుందని.. ప్రభుత్వం వయోపరిమితి సడలించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితి విషయంలో పునరాలోచించి.. సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details