తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాన్సర్​పై అపోహలే ప్రాణాంతకంగా మారుతున్నాయి' - Cancer Basavatarakam Hospital Balakrishna

క్యాన్సర్ వ్యాధిపై ఉన్న అపోహలే రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్​హుడ్ క్యాన్సర్​ డే ని పురస్కరించుకుని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి రష్మికా మందనతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Balakrishna
Balakrishna

By

Published : Feb 15, 2020, 8:56 PM IST

చిన్నారులు భగవంతునితో సమానమని వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రి ట్రస్టీ, సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ చైల్డ్​హుడ్ క్యాన్సర్​ డే ని పురస్కరించుకుని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి రష్మికా మందనతో కలిసి ఆయన పాల్గొన్నారు. బసవతారకం వైద్యశాల తరఫున క్యాన్సర్​తో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్​ను లాంచ్​ చేశారు.

క్యాన్సర్​ వ్యాధిపై ఉన్న భయం, అపోహలే రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆయన చెప్పారు. వ్యాధి నివారణకు చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరి కుటుంబంలోనైనా వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తున్నట్లయితే వారు తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సినీనటి రష్మిక మందన సూచించారు. ఆ మహమ్మారి తమ కుటుంబాన్ని బాధించిందన్నారు. కార్యక్రమంలో క్యాన్సర్​ను జయించిన పలువురు చిన్నారులు పాల్గొన్నారు.

క్యాన్సర్​పై అపోహలే ప్రాణాంతకంగా మారుతున్నాయి

ఇదీ చూడండి:ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details