తెలంగాణ

telangana

క్యాన్సర్​ను ఆదిలోనే గుర్తిస్తే.. అంతం చేయొచ్చు: బాలకృష్ణ

By

Published : Feb 4, 2021, 12:46 PM IST

ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్, సినీనటుడు బాలకృష్ణ హాజరయ్యారు.

క్యాన్సర్​ను మొదట్లోనే గుర్తిస్తే... నివారించొచ్చు: బాలకృష్ణ
క్యాన్సర్​ను మొదట్లోనే గుర్తిస్తే... నివారించొచ్చు: బాలకృష్ణ

క్యాన్సర్​ను మొదట్లోనే గుర్తిస్తే... నివారించొచ్చు: బాలకృష్ణ

మొదటి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే నివారించొచ్చన్నారు బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రి ఛైర్మన్, సినీనటుడు బాలకృష్ణ. 50 ఏళ్లు పైబడిన మహిళలు ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవాలి ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని బాలకృష్ణ కోరారు. క్యాన్సర్‌ను జయించిన వారికి శుభాభినందనలు తెలియజేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి బసవతారకం ఆస్పత్రి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్యాన్సర్​ నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.

క్యాన్సర్​ను ఆదిలోనే గుర్తిస్తే నివారించొచ్చు. క్యాన్సర్​ రకాల్లో కనీసం మూడోవంతు నివారించదగినవి. గత 25 సంవత్సరాల్లో బసవతారకం ఆసుపత్రిలో 2 లక్షల 50వేల మందికి చికిత్స అందించాం. వారిలో చాలా మంది ఇపుడు సాధారణ జీవితం గడుపుతున్నారు. మా నాన్న గారి కృషికి, ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి నా అభినందనలు. క్యాన్సర్​ అనేది అంతుచిక్కని వ్యాధి. ఎంత త్వరగా గుర్తిస్తే... అంత త్వరగా జయించవచ్చు.

--- బాలకృష్ణ, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్

ఇదీ చూడండి:క్యాన్సర్‌ అంటే ఏంటి? నివారణ మార్గాలేంటి?

ABOUT THE AUTHOR

...view details