రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు, టీకాల కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కరోనాపై ఆయన గురువారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాజిటివ్ కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కరోనా సంరక్షణ కేంద్రాలను రెట్టింపు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని, వృథాను అరికట్టాలని చెప్పారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా కృషిచేయాలని సూచించారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రిజ్వి, ప్రీతిమీనా, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, గంగాధర్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోలుకున్న సీఎస్
ఈ నెల 6న కరోనా బారిన పడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కోలుకున్నారు. బుధవారం ఆయనకు నెగెటివ్ నివేదిక రావడంతో గురువారం విధులకు హాజరయ్యారు.