తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాత్రికి రాత్రే రద్దు చేస్తే ఎలా ? భూ సమస్యలు ఎవరు తీరుస్తారు ?' - ttdp state official spokes person durgaprasad

తెరాస సర్కార్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ చట్టం చారిత్రాత్మకమైన చట్టమని చెబుతున్నప్పటికీ... ఇందులో అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని సందేహాలు లేవనెత్తింది. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సర్కార్​పై ఉందని స్పష్టం చేసింది.

'రాత్రికి రాత్రే రద్దు చేస్తా ? భూ సమస్యలు ఎవరు తీరుస్తారు ?'
'రాత్రికి రాత్రే రద్దు చేస్తా ? భూ సమస్యలు ఎవరు తీరుస్తారు ?'

By

Published : Sep 9, 2020, 9:30 PM IST

Updated : Sep 9, 2020, 11:37 PM IST

కొత్త రెవెన్యూ చట్టంపై తెతెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టాన్ని చారిత్రాత్మకంగా చెప్పడాన్ని ఆయన ఖండించారు. కొత్త చట్టంలో అనేక అంశాలు ప్రశ్నలుగానే మిగిలాయని సందేహాలు లేవనెత్తారు. వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

వారితో పూర్థి స్థాయిలో చర్చించాలి..

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రతిపక్షాలతో, సంబంధిత ఉద్యోగ సంఘాలతో పూర్తి స్థాయిలో చర్చ జరపాలని తెతెదేపా పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే పాత రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేయాలన్నారు.

ముందుగా ప్రతిపక్షాలతో...

ముందుగా ప్రతిపక్షాలతోనూ, సంబంధిత సంఘాలతో విస్త్రృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ శాఖలో అనేక తప్పులు జరిగాయని.. ఆ తప్పులకు కేవలం వీఆర్వోలనే బాధ్యులుగా చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

రాత్రికి రాత్రే రద్దు నిర్ణయమా ?

రాత్రికి రాత్రే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేశారని.. రేపటి నుంచి భూ సమస్యలు తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారని దుర్గాప్రసాద్ ప్రశ్నించారు.

వారి సేవలను ఎవరు భర్తీ చేస్తారు ?

భూ సంస్కరణల్లో వీఆర్వోల సేవలు అవసరమవుతాయని... వీరికి ప్రత్యామ్నాయంగా ఎవరిని నియమిస్తారో ప్రజలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. వీఆర్వోల వ్యవస్థ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని దుర్గాప్రసాద్ కోరారు.

'రాత్రికి రాత్రే రద్దు చేస్తే ఎలా ? భూ సమస్యలు ఎవరు తీరుస్తారు ?'

ఇవీ చూడండి : మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్‌ అరెస్టు

Last Updated : Sep 9, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details