అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో యోగాసనాలు వేశారు. ప్రపంచ యోగా డే సందర్భంగా సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా దాదాపు వెయ్యిమంది యోగసాధకులు ఈ కార్యక్రమంలో పరోక్షంగా పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని... మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరూ యోగా సాధనను అలవాటుగా చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
'యోగాతో మానసిక ఒత్తడిని అధిగమించవచ్చు' - అబ్కారీశాఖ మంత్రి తాజా వార్తలు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో యోగాసనాలు వేశారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... ప్రతిఒక్కరూ యోగా సాధనను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని... మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
'యోగాతో మానసిక ఒత్తడిని అధిగమించవచ్చు'
TAGGED:
SRINIVAS GOUD LATEST NEWS