రైలుబోగీలపై ప్రకటనలతో ఆదాయం సమకూర్చుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో భాగంగా రైలు బోగీలపై ప్రచారం చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. మొదటి సారిగా సింగరేణి యాజమాన్యంతో దక్షిణ మధ్య రైల్వే ఒప్పదం కుదుర్చుకుంది. ఇందుకుగాను సంవత్సరానికి రూ.50 లక్షలు రైల్వేకు సింగరేణి యాజమాన్యం చెల్లించనుంది.
దక్షిణ మధ్యరైల్వేలో బోగీలపై ప్రచారం - south central railway ads campaign on bogies
దక్షిణ మధ్యరైల్వే ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగా రైలు బోగీలపై ప్రచారం చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఇటీవల సింగరేణి యాజమాన్యంతో సైతం ఒప్పందం కుదుర్చుకుంది.
దక్షిణ మధ్యరైల్వేలో బోగిలపై ప్రచారం
ఈ ఒప్పందంలో భాగంగా సింగరేణి పోస్టర్లతో తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు తళుక్కుమంటోంది. మొదటి సారిగా రైలు బోగీలపై సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటేడ్ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరనున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలుపై సింగరేణి పోస్టర్లు అంటించారు.
ఇదీ చూడండి : న్యూ ఇయర్ వేళ మళ్లీ డ్రగ్స్ జోరు..!