ప్రస్తుతం పాముల బెడదపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి వచ్చే ఫోన్‌కాల్స్ సంఖ్య తగ్గినట్లు సంస్థ కార్యదర్శి అవినాష్ తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 100కు పైగా ఫోన్‌కాల్స్ వచ్చేవని.. ప్రస్తుతం సగానికి తగ్గినట్లు చెప్పారు. ఏదైనా అత్యవసరమైన సమయాల్లో మాత్రం సభ్యులు వెళ్తున్నట్టు వివరించారు.
పాము కనిపిస్తే ఫోన్ చేయండి! - ఇంట్లోకి పాము వచ్చిందా వెంటనే ఫఓన్ చేయండి
లాక్డౌన్ సమయంలో కూడా ఇంట్లోకి పాములు చొరబడి ఎవరిని ఇబ్బంది పెట్టినా వెంటనే తమను సంప్రదించగలరని కోరారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సంస్థ కార్యదర్శి అవినాష్.
![పాము కనిపిస్తే ఫోన్ చేయండి! friends society for snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6798297-776-6798297-1586929888116.jpg)
పాము కనిపిస్తే ఫోన్ చేయండి!
ప్రస్తుతం నగర శివారు గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి పాములు దూరి ప్రమాదకరంగా మారిన, అత్యవసరమైన సమయాల్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ sfriendsofsnakes.org.in, 83742 33366ని సంప్రదించవచ్చని అవినాష్ కోరారు.
ఇవీ చూడండి:గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స!