భాగ్యనగరంలో క్రిస్మస్ పండుగ సందడి మొదలైంది. క్రిస్మస్ పండుగ అనగానే గుర్తుకు వచ్చే ప్లమ్‌కేక్ మిక్సింగ్ కార్యక్రమాలకు నగరంలోని స్టార్‌హోటల్‌లు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్ హోటల్‌లో ప్లమ్‌కేక్ మిక్సింగ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది ఆల్కాహాల్, వైన్, డ్రై ప్ర్యూట్స్ మిక్సింగ్ చేయడంలో పోటీపడ్డారు.
సందడిగా కేక్ మిక్సింగ్ సంబురాలు
క్రిస్మస్ పండుగ అనగానే రెండు నెలల ముందు నుంచే కేక్ మిక్సింగ్ సంబురాలు మెుదలవుతాయి. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఆదిత్య హోటల్‌లో ప్లమ్‌కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది.
సందడిగా కేక్ మిక్సింగ్ సంబురాలు
ఈ ఏడాది బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఆదిత్య పార్క్ హోటల్ కృషి చేస్తుందని హోటల్ జనరల్ మేనేజర్ పవన్‌కుమార్ తెలిపారు. ఏడాదికి దాదాపు 2లక్షల మంది బాలికలకు వివిధ రూపాల్లో విద్య కోసం సహాయం అందిస్తుందన్నారు.
ఇవీ చూడండి: ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. కిలో @ రూ.400
Last Updated : Nov 21, 2019, 12:04 AM IST