తెలంగాణ

telangana

ETV Bharat / state

cog report on ap debts: అప్పుల్లో ఆంధ్రా టాప్‌.. ఖర్చులోనూ ఫస్ట్! - ap news

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కన్నా అప్పుల విషయంలో(ap debts) ఆంధ్రప్రదేశం ముందంజలో ఉన్నట్లు కాగ్ నివేదిక(cog report) స్పష్టం చేస్తోంది. ఏడాది మెుత్తానికి ప్రతిపాదించిన అప్పును కేవలం నాలుగు నెలల్లోనే సేకరించి ప్రభుత్వం వినియోగించింది.

ap debts
ap debts

By

Published : Sep 26, 2021, 9:14 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే... ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో(AP LOANS) ప్రథమ స్థానంలో ఉన్నట్లు కాగ్‌ నివేదికలు(CAG REPOTERD THAT AP STOOD IN FIRST PLACE) విశదీకరిస్తున్నాయి. ఏడాది మొత్తానికి ఆయా రాష్ట్రాలు బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఇతర అప్పుల రూపంలో ఎంతమొత్తమైతే సమీకరించుకుని బడ్జెట్‌ లక్ష్యాలను నెరవేర్చనున్నాయనే విషయాన్ని తమ ప్రతిపాదిత బడ్జెట్‌ గణాంకాల్లో పేర్కొంటాయి. బడ్జెట్‌ ఆమోదం పొందే క్రమంలో రుణ సంబంధిత వివరాలను శాసనసభల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచుతుంది.

ఏడాది మొత్తానికి ప్రతిపాదించిన అప్పులో తొలి 4 నెలల్లోనే అత్యధిక మొత్తం రుణంగా సేకరించి, ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. ఆయా రాష్ట్రాలు చేసిన ఖర్చులను.. ఇందుకు ఏ రూపంలో ఎంత సమీకరించుకున్నారు, ఎలా ఖర్చు చేశారు.. అన్న అంశాలను ప్రతినెలా కాగ్‌ పరిశీలిస్తుంది. తేడాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకుని ఆయా రాష్ట్రాల లెక్కలను వెలువరిస్తుంటుంది. పశ్చిమబంగ, బిహార్‌ వంటి కొన్ని రాష్ట్రాల లెక్కలు జులై వరకు పూర్తి కాలేదు. ఇంతవరకు వెలువడిన రాష్ట్రాల లెక్కలను పోల్చి చూస్తే ఏడాది మొత్తానికి ప్రతిపాదిత అప్పులో దాదాపు పూర్తి మొత్తం (97.68 శాతం) నాలుగు నెలల్లోనే ఖర్చుల కోసం వినియోగించుకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ కనిపిస్తోంది. ఆ తర్వాత మిజోరం 82.87 శాతంతో రెండో స్థానంలో ఉంది. వినియోగించుకున్న రుణ మొత్తం రూ. 672.16 కోట్లే అయినా మొత్తం ప్రతిపాదిత రుణంలో 82.87% ఇప్పటికే వినియోగించుకోవడంతో రెండో స్థానంలో ఉంది. కేరళ 73.78% మేర అప్పులు తీసుకుని మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత 30% కన్నా మించి ప్రతిపాదిత రుణం పొందిన రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి.

ఆ విషయంలో ఏపీ ముందడుగు

బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రమూ ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. సాధారణంగా బడ్జెట్‌ సమయంలో అనేక అంచనాలు ప్రతిపాదిస్తుంటారు. వివిధ రూపాల్లో ఖర్చులు చేస్తామని నమ్మబలుకుతారు. ఏడాది పూర్తయ్యేసరికి అంచనాలకు, ప్రతిపాదనలకు పొంతనే ఉండదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ తొలి నాలుగు నెలల్లోనే ఏడాది మొత్తం అంచనాల్లో 36% మేర ఖర్చు చేసింది. ఏ ఇతర రాష్ట్రమూ ఈ స్థాయిలో ఖర్చులు చేసింది లేదు. అనేక రాష్ట్రాలు తమ అంచనా ఖర్చులకు దూరంగానే ఉన్నాయి.

ఇదీ చూడండి:Gaddi annaram Fruit Market: దశాబ్దాల గడ్డి అన్నారం మార్కెట్‌ చరిత్రకు తెర

ABOUT THE AUTHOR

...view details