దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు వంతేన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. రాత్రి సమయంలో బ్రిడ్జి వ్యూ నగర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తితో మాదాపూర్, జూబ్లీహిల్స్‌ల మధ్య గ దూరం తగ్గనుంది.
త్వరలోనే అందుబాటులోకి రానున్న కేబుల్ బ్రిడ్జి - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి
184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 754.38 మీటర్ల పొడవు గల బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది.
త్వరలోనే అందుబాటులోకి రానున్న కేబుల్ బ్రిడ్జి
రంగురంగుల విద్యుత్ కాంతులతో మొట్టమొదటి హైదరాబాద్ హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడమే కాకుండా మంచి పర్యాటక ప్రాంతంగా రూపొందనుంది. ఈ వంతెన నిర్మాణంతో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు ఇది ప్రత్యేక ఐకానిక్‌గా ఉంటుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.
ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..
TAGGED:
durgam cheruvu cacble bridge