తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సీఎం కేసీఆర్కు నివేదిక అందచేసింది. ఇవాళ ఉదయం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి నివేదిక సమర్పించింది. అంతకు ముందు కొత్త సచివాలయం ఏర్పాటుపై సంబంధిత శాఖల ఈఎన్‌సీలు మంత్రి వర్గ ఉప సంఘానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను అనుసరించి మంత్రివర్గ ఉప సంఘం తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను సీఎంకు ఇచ్చింది. ఆర్అండ్‌బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లు సీఎంను కలిసి నివేదిక అందచేశారు.
సచివాలయ నిర్మాణంపై సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక - ఈఎన్‌సీలు మంత్రి వర్గ ఉప సంఘం
హైదరాబాద్లో నూతన సచివాలయం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎం కేసీఆర్కు అందించింది.
కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్కు నివేదిక అందచేసిన మంత్రి వర్గం ఉప సంఘం