క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్ది రోజుల క్రితం ప్రకటనకు అనుగుణంగా జీవో 911 విడుదల చేసినట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సబ్‌కమిటీకి ఆయన అధ్యక్షత వహించనుండగా.. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులుగా ఉన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల క్రీడా పాలసీని పరిశీలిస్తామని.. నిపుణులు, క్రీడాకారులతో భేటీ అవుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
'క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ' - క్రీడలు
క్రీడా విధానంపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా జీవో 911 విడుదల చేసినట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
'క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ'
రెండు నెలల్లో క్రీడా విధానం తయారు చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ స్టేడియం ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్‌లో 7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్‌ను ఆదివారం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్లో కూడా ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి:వేడెక్కుతున్న సాగరాలు- భూతాపంతో విపత్తులు