TS Cabinet sub committee meeting : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అప్రమత్తతపై దృష్టి సారించింది. కొవిడ్ పరిస్థితులపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, సన్నద్ధత, వ్యాక్సినేషన్‌పై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి సమీక్షించారు. ఈ మేరకు మంత్రులు, కలెక్టర్లతో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమయ్యారు. దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి హరీశ్ రావు చర్చిస్తుంచారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు.
TS Cabinet sub committee meeting: ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం - hyderabad news
15:08 December 01
కొవిడ్ పరిస్థితులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
Sub committee on covid variant: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. అటు కరోనా నియంత్రణా చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను సభ్యులుగా నియమించారు.
అన్ని రకాలుగా సిద్ధం
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా పరిస్థితులు, వైద్య-ఆరోగ్యశాఖ సన్నద్ధతపై సమీక్షించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, రాష్ట్రంలో పరిస్థితులపై కేబినెట్‌కు నివేదించిన వైద్యారోగ్య శాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అవసరమైన ఔషధాలు, పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖను కేబినెట్ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆ శాఖ సిద్ధమవుతోంది. పడకలు, ఔషధాలు, పరికరాలతో పాటు మానవవనరులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు తెలిపింది.
ఆంక్షలపై డీహెచ్
Covid new variant omicron: ఒమిక్రాన్‌పై ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మెుద్దని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు కోరారు. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ రాలేదన్న ఆయన.. కొత్త కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ఒమిక్రాన్‌కి వేగంగా వ్యాపించే గుణం ఉందని.. వైరస్ తీవ్రత తక్కువగా ఉందని తెలిపారు. ఒమిక్రాన్ బాధితుల్లో లక్షణాలు తలనొప్పి, అధిక నీరసం ఉంటాయని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని ప్రతి ఒక్కరు టీకాలు వేయిచుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:cabinet sub committee on Corona: ఒమిక్రాన్‌పై ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రివర్గ ఉపసంఘం నియామకం