నిరుపేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా సంబంధిత అంశాలన్నింటిపై సమగ్ర వివరాలు అందించాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం(Sub committee review on house sites) ఆదేశించింది. అనుమతి లేని లేఔట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష నిర్వహించింది. సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు పురపాలక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Sub committee review on house sites: 'అన్ని అంశాలపై సమగ్ర వివరాలు అందించండి' - అనుమతి లేని లేఔట్లు
ఇళ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం(Sub committee review on house sites) భేటీ ఇవాళ హైదరాబాద్లో జరిగింది. అనుమతి లేని లేఔట్లు, గ్రామకంఠాల క్రమబద్ధీకరణపై సమీక్ష నిర్వహించింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది.
అనుమతి లేని లేఔట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామకంఠాలు, సంబంధిత అంశాలపై ఉపసంఘం సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన సమాచారం, వివరాలపై సమీక్షించారు. ఇళ్ల స్థలాల సమస్యలతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై సమగ్ర వివరాలను అందించాలని అధికారులను ఉపసంఘం ఆదేశించింది. వచ్చే వారం మరోసారి సమావేశం కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: