ఆదాయం పెంపు మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
నిధుల సమీకరణపై వచ్చిన ప్రతిపాదలను సంబంధిత భాగస్వాములతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రాథమిక నివేదిక అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిధుల సమీకరణపై అధికారులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. అధికారుల ప్రతిపాదనలపై చర్చించి.. వివిధ స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదింపుల తర్వాత ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.