రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 9 నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపాలి. దీనికి అనుగుణంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం సమావేశం నిర్వహించాలని ప్రతిపాదన ఉన్నా ఆదివారం జరిపేందుకే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది.
రేపు మంత్రి మండలి భేటీ... బడ్జెట్‌కు ఆమోదం - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
మంత్రి మండలి సమావేశం ఆదివారం నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. సోమవారం నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సీఎం కేసీఆర్
Last Updated : Sep 7, 2019, 6:30 AM IST