హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. తొలిసారిగా భేటీ అయిన పూర్తి స్థాయి మంత్రి మండలి సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగింది. 2019- 20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోద ముద్ర వేసింది. రేపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
ఇవాళే బడ్జెట్: శాసనసభలో కేసీఆర్.. మండలిలో హరీశ్ - మంత్రివర్గ విస్తరణ
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా పూర్తి స్థాయి మంత్రి మండలి సమావేశమైంది. 2019-20 బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం.. రేపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మాణంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. పురపాలక ఆర్డినెన్స్ స్థానంలో కొత్తచట్టం కోసం బిల్లుపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపైనా సమాలోచనలు సాగించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఉపసంఘం నివేదికపైనా చర్చ జరిగింది. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లోకి మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.రేపు శాసనసభలో సీఎం కేసీఆర్, శాసన మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఇవీ చూడండి : ఉదయం కుంకుమార్చన... సాయంత్రం దీపారాధన