లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మే 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కరోనా నియంత్రణ స్థితిగతులు, వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్ డౌన్ అమలుపై సమావేశంలో చర్చిస్తారు. మే 7 వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
లాక్ డౌన్‌పై కేబినెట్లో చర్చ..
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇతర సడలింపులను సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి.. భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గ భేటీలో ఖరారు చేయనున్నారు. ఇతర అంశాలు, సమస్యలపైనా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చూడండి : 160 కోట్ల మంది జీవనోపాధిపై కరోనా దెబ్బ