బీసీ గురుకులాలు, ఆర్ అండ్ బీలో భారీగా ఉద్యోగాల భర్తీకి.. సర్కారు ఆమోదం - ఆర్‌అండ్‌బీలో ఉద్యోగాలు
20:18 December 10
ఆర్ అండ్ బీ శాఖలో అదనపు ఉద్యోగ నియామకాలకు ఆమోదం
బీసీ గురుకులాల్లో 2,591 ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమశాఖ, జ్యోతిబా పూలే బీసీ విద్యాసంస్థలకు పోస్టులు మంజూరు చేసింది. అలాగే 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ప్రారంభించిన కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది భర్తీకి కూడా ఆమోదం తెలుపుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగ ఖాళీలు.. మరో వైపు ఆర్ అండ్ బీ శాఖలో అదనపు ఉద్యోగ నియామకాలకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీలోని పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ఆర్ అండ్‌బీలో 3 సీఈ, 12 ఎస్‌ఈ, 13ఈఈ, 102 డీఈఈ, 163 ఏఈఈ పోస్టులు మంజూరు చేసింది. అలాగే 28 డీఏ ఆఫీసర్, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్ల మరమ్మతుల కోసం రూ.1,865 కోట్లు మంజూరు చేసింది. అత్యవసర పనుల కోసం ఇంజినీర్లకు ఏడాదికి రూ.129 కోట్లు కేటాయించారు. అవసరమైన మేరకు కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి: