మంత్రివర్గ విస్తరణకు రేపు శుక్రవారం దశమి మంచి మూహుర్తంగా తెరాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేడు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఫామ్‌హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనను పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. 17న కేసీఆర్ పుట్టిన రోజు, 18 నుంచి మూడు రోజుల పాటు ఆర్థిక సంఘం పర్యటన ఉంది.
మంత్రివర్గ విస్తరణపై నేడు స్పష్టత..! - ముఖ్యమంత్రి
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై నేడు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు కేబినెట్ విస్తరణకు ముహూర్తంగా పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ..?
సీఎం పుట్టిన రోజుకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుతుందని భావిస్తున్నారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం.