పైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్మకు పాల్పడిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది. అప్పు చెల్లించినా వేధిస్తున్నారంటూ సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
'నా లేఖను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండి... ఇదే చివరి కోరిక' - కృష్ణా జిల్లా నేర వార్తలు
అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయేముందుకు ఓ లేఖ రాసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో రాశాడు. ఈ లేఖను ఏపీ సీఎం జగన్‌కు చేరవేయాలని పేర్కొన్నాడు.
కృష్ణా జిల్లా పమిడిముక్కుల మండలం ముళ్లపూడికి చెందిన శివమల్లేశ్వరరావు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం కొందరి దగ్గర అప్పులు చేశాడు. అయితే అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినా తనను ఫైనాన్షియర్లు వేధిస్తున్నారంటూ అతను ఓ లేఖ రాసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ మేనేజర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని సూసైడ్ లెటర్లో పేర్కొన్నాడు. సందీప్, నాగరాజు, శివ చింతయ్యల దగ్గర తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించినా ఇంకా వేధిస్తున్నారని... ఇలాంటి నేరాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లమని పోలీసులను వేడుకున్నాడు.