హైదరాబాద్ ఎల్బీనగర్లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. క్యాబ్స్కి మీటర్ విధానం అమలు చేయాలన్నారు. ఒకే దేశం ఒకే టాక్స్ విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలని క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలతో వాహనాలు నడపలేక లేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
క్యాబ్ డ్రైవర్ యూనియన్
ఇంధన ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించాలని లేకపోతే అన్ని యూనియన్లు, అసోసియేషన్లు మహాకూటమిగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్యాస్, చమురు ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనలు