తెలంగాణ

telangana

ETV Bharat / state

పది దాటిన తర్వాత ప్రసంగాలా - అయితే 'విజిల్'​వేయడమే - హైదరాబాద్​లో ప్రచారం వల్ల ఇబ్బందులు

C Vigil App Complaints in Hyderabad : రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఉదయం ఆరు గంటలకు మొదలవుతున్న ఈ ప్రచారాల హోరు అర్ధరాత్రయినా ఆగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మీ ఏరియాలో కూడా పది దాటిన తర్వాత మైకులు పెట్టి గట్టిగట్టిగా ప్రసంగాలిస్తున్నారా..? ఆ సౌండ్ భరించలేక ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే దానికి ఓ పరిష్కారం ఉంది. అదే సీ-విజల్​ యాప్​. మరి ఈ యాప్​తో ఏం చేయాలో తెలుసుకోండి .

Complaints on Election Campaign after 10pm in Hyderabad
C Vigil App Complaints in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 6:01 PM IST

C- Vigil App Complaints in Hyderabad: రాష్ట్రంలోని కొంత మంది నాయకులు రాత్రి పది గంటలు దాటినా.. ప్రచారంతో సామాన్యప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో ఉద్యోగం చేసుకుని వచ్చి ప్రశాంతంగా నిద్రపోదం అనుకుంటే.. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాటలను అధిక శబ్దాలతో పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంత ప్రజలు సహించలేక కొంత మంది వ్యక్తుల ప్రచారం చేసే వ్యక్తులను నిలదీస్తున్నారు. మరికొందరు సీ-విజల్​ యాప్​ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.

Complaints on Election Campaign after 10pm in Hyderabad : గత వారం రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ ఫిర్యాదు అందగానే అధికారులు అప్రమత్తమై ఆ సమస్యను పరిష్కరించే పనిలో పడుతున్నారు. అయితే ఈ సమస్య మీకు ఎదురైతే ఎలా సీ- విజల్​ యాప్​లో కంప్లెయింట్​ చేయాలని అనుకుంటున్నారా.. దానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందా.

Apps to Complain about Election Irregularities : ఈ యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకోండి.. ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకోండి

Political Leaders Campaign After 10 pm : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అయితే ఎన్నికల సంఘం ప్రచారంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే సీ-విజల్​ యాప్​ ద్వారా పిర్యాదు(C Vigil app Complaints 2023) చేసే అవకాశాన్ని కల్పించింది. మీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఓటర్లలను ఎవరైనా ప్రభావితం చేస్తే ఈ యాప్​ ద్వారా అధికారులకు తెలపవచ్చు. అధికారులకు ఫిర్యాదు అందిన 100 నిమిషాల లోపు సమస్యను పరిష్కరించి.. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

ఎన్నికల వేళ ప్రచార రథాలకు భారీగా డిమాండ్

  • ఈ సీ- విజిల్​ యాప్​ను అన్ని రకాల ఫోన్లలోను వినియోగించవచ్చు. గూగుల్​ ప్లేస్టోర్​లోకి వెళ్లి యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి. అనంతరం ఫోన్​ నంబరు, పేరుతో లాగిన్​ అవ్వొచ్చు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను అరికట్టేందుకు ఈ యాప్​ ఉపయోగపడుతోంది.
  • ఎన్నికల నిబంధనల(Assembly Election Rules in Telangana) ప్రకారం ఫిర్యాదును సంబంధిత అధికారులు 100 నిమిషాల్లో పరిష్కరించాలి. ఫిర్యాదుదారు వివరాలను ఎవరికి తెలియనివ్వరు.
  • ఈ యాప్​ ద్వారా చేసే ఫిర్యాదులు నియోజకవర్గానికి ఐదు చొప్పున ఏర్పాటైన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు వెళ్తాయి. అనంతరం జీపీఎస్​ ద్వారా సమస్య ఉన్న ప్రాంతానికి చేరుకుని అధికారులు చర్యలు తీసుకుంటారు.
  • ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకు భాగ్యనగరం పరిధిలో సీ-విజల్​ యాప్​ ద్వారా 306 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. వాటిలో సగం ఫ్లెక్సీలు, గోడపత్రికలకు సంబంధించినవే ఉన్నాయి. 5 శాతం రాత్రి సమయాల్లో ప్రచారంపై చేస్తున్న వాటిపై ఉన్నయాని అధికారులు పేర్కొన్నారు.

Special Interview on C Vigil APP : ఎన్నికల వేళ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సీ-విజిల్.. ఈ విషయాలు తెలుసుకోండి..!

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ

ABOUT THE AUTHOR

...view details