ETV Bharat / state
అధికారమార్పిడి జరిగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం - 2019 TELANGANA ELECTIONS
" కరుడుగట్టిన తెలంగాణవాది... ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది... కేంద్రంలో అధికారమార్పిడి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది " ప్రొఫెసర్ కోదండరాం
కేంద్రంలో అధికారమార్పిడి జరిగినపుడే... తెలంగాణ అభివృద్ధి సాధ్యం
By
Published : Mar 27, 2019, 1:20 PM IST
| Updated : Mar 27, 2019, 1:35 PM IST
కేంద్రంలో అధికారమార్పిడి జరిగినపుడే... తెలంగాణ అభివృద్ధి సాధ్యం కేంద్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తెజస మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రొఫెసర్ అంగీకరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. Last Updated : Mar 27, 2019, 1:35 PM IST