తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి' - bv raghavulu latest news

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ణాన కేంద్రంలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి స్థానిక యాదాద్రి ఎన్​క్లేవ్​ కాలనీవాసులు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ట్రస్ట్​ ఛైర్​న్​ బీవీ రాఘవులు కోరారు.

ట్రస్ట్​కు చేయూత
ట్రస్ట్​కు చేయూత

By

Published : May 8, 2021, 10:48 PM IST

కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ ఛైర్మన్‌ బీవీ రాఘవులు పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ణాన కేంద్రంలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. ఇందుకోసం బాగ్‌లింగంపల్లిలోని యాదాద్రి ఎన్‌క్లేవ్‌ కాలనీవాసులు ఆర్థిక చేయూతను అందించేందుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు.

ఎస్వీకేలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఉచితంగా సేవలు అందిస్తున్న ట్రస్ట్‌ సేవల కోసం రూ.26 వేల నగదుతో పాటు మూడు రైస్‌ బ్యాగ్‌లు, 100 కోడిగుడ్లను ట్రస్ట్‌ ఛైర్మన్‌ బీవీ రాఘవులుకు యాదాద్రి కాలనీవాసులు అందజేశారు. ఈ సందర్భంగా యాదాద్రి కాలనీవాసులకు బీవీ రాఘవులు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కష్టకాలంలో రోగులను ఆదుకునేందుకు ముందుకు రావాలని దాతలను కోరారు. కార్యక్రమంలో యాదాద్రి ఎన్‌క్లేవ్‌ ఆర్గనైజర్స్​ కలుకూరి రాజు, దాసరి రవి ప్రసాద్‌, టి.శ్రీనివాస్‌ రావు, షేక్‌ ముస్తఫా, సాయి కిశోర్​, అరుణ్‌ కుమార్‌, దశరథ్‌, మహేందర్‌లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. కరోనా బాధితులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ-కాన్ఫరెన్స్​

ABOUT THE AUTHOR

...view details