తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మె ఆగినా.. బస్సులు కదలడం కష్టమే...!

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారులు, కార్మికులకే కాక బస్సులకు చిక్కులు వచ్చి పడుతున్నాయి. సమ్మె కారణంగా అన్ని బస్సులను నడపలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో చాలా బస్సులు మూలనపడ్డాయి. ఇదే ఇప్పుడు సంస్థకు  ప్రధాన సమస్యగా మారనుంది. ఏంటా కారణం అనుకుంటున్నారా?

సమ్మె ఆగినా.. బస్సులు కదలడం కష్టమే...

By

Published : Nov 16, 2019, 4:53 PM IST

తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాక పోవటంతో తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని బస్సులను విధుల్లోకి తీయడం లేదు. ఈ బస్సులన్నీ డీజిల్ వాహనాలే. ఇన్ని రోజులుగా షెడ్లలో ఉన్నందున బస్సుల ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
అన్ని బస్సులు నడిపే పరిస్థితి లేదు...
రాష్ట్రంలో ఆర్టీసీకి 8,400 వరకు సొంత బస్సులు ఉన్నాయి. 2,100 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. మొత్తం బస్సుల్లో 4,200 నుంచి 4,600 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు రోజూవారీగా ప్రకటిస్తున్నారు. ఈ లెక్కన సుమారు నాలుగు వేల వరకు బస్సులను నడిపే పరిస్థితి లేదు.

సమ్మె ఆగినా.. బస్సులు కదలడం కష్టమే...
ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ...కొన్ని బస్సులకు బ్యాటరీలను మార్చాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ఒక్కో బ్యాటరీ ఖరీదు 6 వేల నుంచి 7 వేల వరకు ఉంటుంది. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియని నేపథ్యంలో రోజులు గడిచే కొద్ది వాహనాల్లో సమస్యలు పెరుగుతాయని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. డిపోల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న కారణంగా పైభాగాలకు తుప్పు పట్టే అవకాశం కూడా ఉంది. 40 రోజులుగా ఉపయోగించని బస్సులను బయటకు తీయాలంటే కనీసం 24 గంటల సమయం అదనంగా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details