ETV Bharat / state
నిజాంపేట్లో ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం - నిజాంపేట్లో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం
హైదరాబాద్ నిజాంపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురైన బస్సు
By
Published : Mar 24, 2019, 5:38 AM IST
| Updated : Mar 24, 2019, 8:53 AM IST
నిజాంపేట్లో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం కూకట్‌పల్లి నిజాంపేట్ రోడ్డులో ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరవింద్ అక్కడికక్కడే మరణించాడు. గాయాలపాలైన అనంతలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లింది. యూసుబ్ అనే వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు. బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి Last Updated : Mar 24, 2019, 8:53 AM IST